STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

చేరిన చెలిమి

చేరిన చెలిమి

1 min
325

చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు

అమిరిన ఆశల్లో అలవోకనే నిలిపి చూపావు

హత్తుకొని ఆమనిలా అహ్లాదాన్నే పంచేసావు

ఒత్తిగిలి పొత్తిలి ప్రేమ నులివెచ్చన చేసేసావు


కాదన్నా అవునన్నా కమనీయమే ఆ చూపు

ఏదన్నా లేదన్నా ఎదలోనే సంచరించే రూపు

కోమలమే కొంటెతనంలోన కోరికగా చూడనే

అమలమే ఆ మనసంతనూ ఆశలతో వేడనే

చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు

అమిరిన ఆశల్లో అలవోకనే నిలిపి చూపావు


బ్రతుకులోన బంగారపు వలపునే నిలిపావు

అతుకులేని బంధానికి అమరికతో కలిపావు

ఎన్ని జన్మలకో ఎనలేని నెమ్మి ఎద నింపావు

అన్ని తన్మయాలే తనువంత అలా ఒంపావు


చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు

అమిరిన ఆశల్లో అలవోకనే నిలిపి చూపావు

హత్తుకొని ఆమనిలా అహ్లాదాన్నే పంచేసావు

ఒత్తిగిలి పొత్తిలి ప్రేమ నులివెచ్చన చేసేసావు


కామితమే తీర్చ ఆ కలయికే కాంచన పతకం

అమితమే తీయదనం అధరాల తేనె సంతకం

కామితమే తీర్చ ఆ కలయికే కాంచన పతకం

అమితమే తీయదనం అధరాల తేనె సంతకం

చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు

అమిరిన ఆశల్లో అలవోకనే నిలిపి చూపావు


Rate this content
Log in

Similar telugu poem from Romance