నిదురే రానీదు..
నిదురే రానీదు..
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి
నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
మనసులో మత్తులే జల్లి మరపులేచేసి
వీనసూలా విందులే కళ్ళకు గారడిచేసి
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి
నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
పాత ఊసులే అలా పహారాలే కాయగా
లేత ఆశలు చాలా విహారాలూ చేయగా
నిశీథంనిగ్రహించి నియమం పాటించగా
నిషేధం నిలిపుంచి నికుంజం ఆశించగా
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి
నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
చుక్కలన్నీ రెక్కలిప్పి రెప్ఫ వేయలేదూ
మొక్కలన్నీ మ
త్తుగా సద్దు చేయలేదూ
గాలిగంధం గమనమేలేక గతి తప్పెనూ
పూల చందనం తాపుప్పొడిని విప్పెనూ
ఇక అదనులో పదును కలిపి చూపనూ
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి
నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
కోరికలే ఆభిసారికలై కొలువులే చేయనే
ఊరికనే ఉండకనే ఉల్లమూ పంచేయనే
కోరికలే ఆభిసారికలై కొలువులే చేయనే
ఊరికనే ఉండకనే ఉల్లమూ పంచేయనే
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి
నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
మనసులో మత్తులే జల్లి మరపులేచేసి
వీనసూలా విందులే కళ్ళకు గారడిచేసి