ఎన్నాళ్ళీ మౌనం
ఎన్నాళ్ళీ మౌనం
ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం
కొన్నాళ్ళ మరపే మరులు మసకేయను సహజం
ఏదో జ్ఞాపకం ఎదనే తడిమి ఎదురుగా నిలిచింది
అదే రూపం అడుగకనే నిండు మదిలో తలచింది
కోరికన్నది కొసరికొసరి కోమలినే కోరేసి వలచింది
కోరుకున్నది జరగాలని మనసులో అదినిలిచింది
ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం
కొన్నాళ్ళ మరపే మరులు మసకేయను సహజం
వచ్చిన వసంతం వలపంతను వాకిటనే చేర్చగా
నచ్చిన మనసంతనే నవనీతమై రాగం కూర్చగా
మాయచేయకు మనసును మోసపోదు తేలికగా
లోయ లోతులాటిదని అది పోల్చవచ్చే పోలికగా
మాయచ
ేయకు మనసును మోసపోదు తేలికగా
లోయ లోతులాటిదని అది పోల్చవచ్చే పోలికగా
ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం
కొన్నాళ్ళ మరపే మరులు మసకేయను సహజం
వచ్చిపోయేది కాదూ ఆ వలపంటే వదిలించను
నచ్చి ఉండిపోయేది నవవసంతమై కదిలించను
ఆమనిలా అది అలరించులే అంతరంగమందూ
ఏమని అడగక ఎడదను కలిపుంచేయి ముందూ
ఆమనిలా అది అలరించులే అంతరంగమందూ
ఏమని అడగక ఎడదను కలిపుంచేయి ముందూ
ఎన్నాళ్ళీ మౌనం ఎరుక పరచనూ అసలూ నిజం
కొన్నాళ్ళ మరపే మరులు మసకేయను సహజం