తీయని వలపు
తీయని వలపు


సా౹౹
ఎడద చేరినే చెలి తెచ్చిన జ్జాపకాల పండుగ
ఆ సృతులే లేకున్న జీవితము కాదా దండుగ
ప౹౹
ఆశలూ ఊసులూ కలివిడిగా రేపినే కలవరం
అసలు ఏమిటో చెప్పవే మనసా మరి వివరం ౹2౹
చ౹౹
తీయని వలపే తీగలు సాగి పూలు పూయగా
హాయిని పెంచే ఆమని ముందడుగు వేయగా ౹2౹
గిలిగింతల ఆ క్షణం ప్రేమలోన మధుర రణం
పులకింతలే మదిలో తను తలచిన తరుణం ౹ప౹
చ౹౹
చందమామ చల్లని వెన్నెలే చక్కిలగింతలుగ
అందమైన అనుభూతి ఎదలో గిలిగింతలుగ ౹2౹
ఊగించెనే ఊహలుగా ఊసులతోనే ఊరించి
మ్రోగించెనే ఎలమి నాదం మనసూ లయించి ౹ప౹
చ౹౹
కడలి తీరం కమ్మనీ సమీరం కమనీయమేగా
సడలించి సమయాన్ని ఆ చంద్రుడే నిలిచెగా ౹2౹
కదలి ఆ తలపులలోని వలపును వరించవా
వదలిన ఆశలను వర్తమానంతో సవరించవా ౹ప౹
చ౹౹
ఆ తలపులేగ తనువంత పులకించే పండుగ
ఆ వలపులేగ అణువణువూ నిలిచే నిండుగ ౹2౹
తన్మయత్వమే నింపెనే జ్జాపకాల వలపంతా
చిన్మయానందమే చిప్పిల్లినే చిరకాలమంతా ౹ప౹