వరసైన వలపు
వరసైన వలపు


ప౹౹
వలపంతా వర్ణించను వరసైనవాడే కావాలిగా
మనసంతా చిత్రించనూ మదనుడే రావాలిగా ౹2౹
చ౹౹
ఎక్కడిదీ సౌందర్యం ఎద మొత్తం కుదిపేసినది
చిక్కడిన ఆంతర్యం అది మొదలు కదిపేసినది ౹2౹
రేయి పగలూ రెపరెపలాడింది మనసు లోలకం
హాయి హంగూ కలిసి మార్చినే మనిషి వాలకం ౹ప౹
చ౹౹
ఈడేరిన వయసు వివరించేను వింత విషయం
ఓడెరుగని వలపే వరదై తొలగించినే సంశయం ౹2౹
పెను మాయేలే ప్రేమంటేను తెలుసుకున్నాకను
పెనవేసే మనసును తనువు కలుసుకున్నాకను ౹ప౹
చ౹౹
మాటైన వినని మనసుకు ప్రేమే మంచి ఔషధం
ఘాటైన ప్రేమ గడువే గుర్తించి చేయాలి నిషేదం ౹2౹
నీరెంత తోడిననూ మరల నిండును ఊటబావి
మరులెంత కురిపించినా కురచబడదే ప్రేమదీవి ౹ప౹
చ౹౹
కనుసైగలే పెను బాసలూ ప్రేమలోన ఇరువురికి
మునుమాపు ముచ్చటలే చేరు ముసిమి దారికి ౹2౹
వరసైన వలపునూ వద్దనక వర్ణించి వలపించనీ
సొగసైన సోయుగాన్ని సొంతంచేసి మరపించనీ ౹ప౹