పరిచయం
పరిచయం
ఒకే ఒక్క ఙ్ఞాపకం
నితో పరిచయం
బోసి నవ్వుల పలకరింపు
కంటి చూపుల సమాధానం
ప్రతి రోజూ నీ దర్శనం
పులకించెను మదిలో మధువనం
విడువలెక ఉన్న మన బంధం
కాలం దూరం చెసింది
కనపడని క్షణం ఒక కలవరం
ఉప్పెన లా పొంగింది హృదయం
దూరం అవుతున్న క్షణం
చూపుల్లో అంతా శూన్యం
కాలం చెసిన గాయం
పెంచింది మన మధ్య మౌనం
హృదయం వీడేనా మౌనం
పంచేన చిరునవ్వుతో సంతోషం.