మనసు మరీ..
మనసు మరీ..


ప౹౹
మనసు మరీ హత్తుకొని తూలిపోతుందే అలా
సొగసు చేరి పొత్తు కోరి అల్లాడిపోతుందే ఎలా ౹2౹
చ౹౹
కలలో కూడ కవ్విస్తుందే కళ్ళతో మాట వినకా
అలలా ఊపేస్తుందే అసలా చూపులతో కనకా ౹2౹
అణువులో అణువై అంకితమే చేసి పోతుందే
తనువులో తనువై తన్మయమై కలసిపోతుందే ౹ప౹
చ౹౹
పూల వారధి పున్నమి తీరమే తీరుగా చేర్చులే
కలల సారధి ప్రయత్నం చేసి ఫలితం మార్చులే ౹2౹
మార్గమే చూపిన ఆమనికి మరిచిపోని సృతులే
స్వర్గమే దిగివచ్చి దీవించీ ఇచ్చిలే అనుమతులే ౹ప౹
చ౹౹
పండుగేలే పరువానికి పరువళ్ళతో పరిశ్రమించి
దండుగే చేయకూ ఆ దరహాసాన్ని అదను లోనే
విశ్రమించి ౹2౹
పరిఢవించే ప్రణయానికి పంకజాలై పల్లవించనీ
అనుభవించే ఆశలను అంబుజాలై గమనించనీ ౹ప౹