అనుకోని స్వప్నం
అనుకోని స్వప్నం


ప౹౹
అనుకోని స్వప్నం అరుదెంచను ఓ రేయి
కనుగొని ఆ మధురం కలిగించెను హాయి ౹2౹
చ౹౹
ఊరికే ఉండదుగా మనసు మరిచి కూడ
చేరికే లేక చెడునే బంధం చెప్పక ఏ జాడ ౹2౹
కలయే వచ్చి కలుపునులే కదలని ఎదనే
ఇలయే మెచ్చిఇంపుగా పాడునే ఆ కథనే ౹ప౹
చ౹౹
నిశీథం నిషేదించదే ఏ కలనూ ఎప్పుడూ
నిషాదం ఆవహించే స్వరంతో అప్పుడూ ౹2౹
కలకూడ కమనీయమే కలకంఠితో కలసి
కల వరించిన కడురమ్యం మదినే తలచి ౹ప౹
చ౹౹
కలగనీ ఆ సౌఖ్యమే కలలతోనే కలగలసి
కల గని ఆ సుఖం హాయి బాగునే తెలసి ౹2౹
అనుకోని స్వప్నం అరుదెంచెను ఓ రేయి
కనుగొని ఆ మధురం కలిగించెను హాయి ౹ప౹