సఖియా
సఖియా
నా మనసే మధుపాత్రగ..నిలిపితినే సఖియా..!
నీ చూపుల మధువు కాస్త..కోరితినే సఖియా..!
ఈ ఒంటరి తనముకన్న..ఎడారివేడి నయం..
నీ వలపను గొడుగుతోడు..వేడితినే సఖియా..!
నీ తియ్యని నిట్టూరుపు..వినిపిస్తూ ఉన్నది..
వేడుకైన వసంతమై..వేచితినే సఖియా..!
శిశిరాలకు ముద్దొచ్చే..నవపల్లవ రాశీ..
నీ అడుగుల జాడలనే..మరిగితినే సఖియా..!
మన చెలిమికి సాక్ష్యమేదొ..పదిలమే లోలో..
హృదయములో నీ ప్రేమను..దాచితినే సఖియా..!
నీ నవ్వుల ఆ వీణా..సందడెంత మధురం..
భావాంబర రాగసుధల..తేలితినే సఖియా..!

