STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రకృతి నేస్తాలు

ప్రకృతి నేస్తాలు

1 min
0


చెట్టుచేమ రైత్తన్నలే 
ప్రకృతి నేస్తాలంటా,
ధనముతో పోల్చలేని 
జాతి సంపదే మీరంటా,
ఆకలిదప్పులు తీర్చు 
శాంతి కోవెలలో 
దేవుళ్ళే మీరంటా.

మోడు వారిన మొక్కను 
కన్నీటి జలముతో బ్రతికించు 
ప్రేమమూర్తి రైతన్నంటా,
ఆశల చిగురుతో పలకరించు మొక్కను చూసి ఆకలిదప్పులు మర్చునంటా,
పుడమికి ముచ్చటైన 
పచ్చకోక కట్టడమే 
సత్యభాగ్యంగా తలచువాడంటా,
మట్టికణంలో పరమాన్నం చూసేటి తన తలపే మనోహరమంటా.

అమ్మతనం రంగరించిన 
మనసే మీదంటా,
గుండెసడి ఆగిపోయినా 
బ్రహ్మతత్వ సుధను పంచేదే మీరంటా,
కళాభిమాని చిత్తంతో 
మురిపించిన చిత్రాన్ని 
వర్ణించ పదములే చాలవంటా,
అమ్మ మనసు కనిపించు 
పసిడి వెలుగుల భావనకు జేజేలు పలకాలంటా.


Rate this content
Log in

Similar telugu poem from Classics