మర్చిపోతారు
మర్చిపోతారు
నువ్వు ఎంత ప్రేమ చూపించిన.
ఎంత గారాబం చేసిన.
మంచి చేసి ప్రాణం కాపాడిన.
నేనున్నానంటూ ధైర్యం చెప్పిన.
వచ్చిన బాధలు తీర్చేసిన.
బ్రతుకు రాతను మార్చిన.
సంతోషం మోసుకు వచ్చిన.
వాళ్ళ కోసం కన్నీరు కార్చిన.
కష్టాలను ఓర్చుకొని సముద్రమంతా ప్రేమ పంచిన.
ఎన్ని గాయాలు ఓర్చుకున్నా.
లోకాన్ని కొత్తగా చూయించిన.
గెలుపుల వైపు నడిపించిన.
జీవితానికి అర్థం మార్చిన.
మర్చిపోయే వారే తప్ప గుర్తుంచుకునే వారు
కరువు ఈ లోకంలో...
