STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇదేనా నిజం

ఇదేనా నిజం

1 min
2

ఇదేనా నిజం.. ఇలాగే ఉంటుందా ఈ జీవన నైజం..
ఈ భూమి నాది అంటూ ఈ నటన నాది అంటూ 
క్రొత్తతరం వస్తుంది పాతతరాన్ని నెడుతుంది
విడిచేయాలా అన్ని దూరం చేయాలా

పెంచుకున్న ఈ బంధాలు పెనవేసుకున్న ఈ అందాలు
 మావి అన్న ఆ కథలు మాలోని ఆ కలలు 
మావి కావు అంటూ తరలిపోతూ ఉంటే
 వదిలేయాలా ఇంకొకరికి ఇవ్వాలా 

చిన్ననాటి బంగారు లోకం విడిచిపోయిందిరా 
మూతి మీద నూనూగు మీసం తెల్లబడుతుందిరా
వడలిపోతుంది శరీరం విసిగిపోతుంది ప్రాణం
నవనిర్మాతల మేమంటూ ఆ బాధ్యత మాదేనంటే 
వదిలేయాలా వారసుడిగా చేయాలా


Rate this content
Log in

Similar telugu poem from Classics