STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ కోసం నేను

నీ కోసం నేను

1 min
1


నీకోసం నేను బతుకు..బతుకేనోయ్ బతుకంటే..!
నా లోపల నువ్వుండే..చోటేనోయ్ ఇల్లంటే..!

ఎంతచదివి ఏం లాభం..పుట్టినదెందుకొ తెలియక..
భయంగుట్టు రట్టుచేయు..చదువేనోయ్ చదువంటే..!

భాషలేల సరిపోవును..భావాలను వెల్లడించ..
గుణాలన్ని రాల్చుకునే..గుణమేనోయ్ ధనమంటే..!

రహస్యాలు బట్టబయలు..చేయు నిన్ను చూపనెలా..
మౌనంతో మాట్లాడే..నీవేనోయ్ గురువంటే..!

అమ్మతనం నాన్నతనం..నీ సాక్షిగ జీవధార..
నరనరాన ప్రవహించే..వెలుగేనోయ్ మధువంటే..!

నీ పలుకుల కలకండను..సరిగతెలిసి పంచెదనిక..
నీకు పెట్టి నేను తినే..మెతుకేనోయ్ మెతుకంటే..


Rate this content
Log in

Similar telugu poem from Classics