శరణం
శరణం
జగములనే సృష్టించిన ఓ బ్రహ్మయ్యా!
జీవకోటి నే సృజించి ఆడిస్తున్నావయ్యా!
తెలిసీ మాయనుండి తప్పించుకో లేకున్నామయ్యా!
గీతాసారమును కాచి వడబోసినా అర్థం కాలేదయ్యా!
నేనూ, నాదను భ్రమలో జీవిస్తున్నామయ్యా!
భ్రమలో జీవిస్తూ, నిన్నే భ్రమగా తలచేమయ్యా!
తలచినదే జరగుతోందని భావించేమయ్యా!
అదియంతా నీవాడు నాటకమని గ్రహించలేమయ్యా!
ఎన్ని నేర్చినా, నీ మాయను, మరి కనుగొనలేమయ్యా!
సర్వాంతర్యామిగా కనుగొని నిను గొలుచేమయ్యా!
నీ మాయను కానలేని దీనులమయ్యా,
మా మొరనాలించి, పాలించగ రావయ్యా!
నీ మాయా ప్రపంచంలో మేము పావులమయ్యా!
జనన మరణాలు జీవులకు సహజమేనయ్యా!
నీవే దిక్కని శరణుకోరి వచ్చామయ్యా!
శరణొసగి మమ్ముల కాపాఢగ రావయ్యా!