ఆచరణ
ఆచరణ


పద్యం:
అధ్వరములు చేయు అసుర బృందము కూడ
భాగవత పఠనము భాగ్యమేల
ఆచరించినపుడె అసలైన ఫలమొచ్చు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! రాక్షసులు కూడా యజ్ఞ యాగాలు చేస్తారు. ఊరికే భాగవతము చదివినంత మాత్రాన పుణ్యం లభించదు అందులోని సారాన్ని అర్థం చేసుకొని, ఆచరణ లో పెట్టినప్పుడు అసలైన ఫలితం దక్కుతుంది.