విశ్వకవి
విశ్వకవి
*విశ్వకవి*
(తేటగీతి పద్యములు.)
విశ్వకవి రవీంద్రుడు విద్య విలువ నెరిగి
శాంతి సదనంబు నిర్మించె జగతి కొఱకు
విశ్వ విద్యాలయము నందు విద్య నేర్పి
సకల మానవాళికి తాను జయము కూర్చె /
తత్త్వ వేత్తగా నలరిన దార్శనికుడు
పారమార్థిక చింతన పరిఢవిల్ల
కవి, రచయితగా విశ్వమున్ గాంచి ఘనుడు
వ్రాసి నాడు గీతాంజలి వసుధ మెచ్చ/
సరస సంగీత చిత్రపు శాస్త్రగనిగ
పండితీ విభవంబు సాధించి ప్రాజ్ఞుడయిన
విశ్వకవి జాతి కీర్తిని పృథ్వి యందు
నిలిపి తారకై వినువీధి వెలుగుచుండె//
