STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ఓటేద్దాం రండి! ( వచన కవిత )

ఓటేద్దాం రండి! ( వచన కవిత )

1 min
15

ఓటేద్దాం రండి 
(వచన కవిత )

ఉన్నతాశయాలు కల్గిన యువతరపు ప్రతినిధులకు.
కన్నభూమిని ప్రేమించే మనసుకల కార్యశూరులకు.

పిన్నా పెద్ద భేదంబు చూపని పెద్ద మనుషులకు.
వెన్ను దన్నుగా నిలిచి పాలించే విద్యావంతులకు.

జాతినభివృద్ధి పథములోనడిపించు జ్ఞానులకు.
నీతి మంతులై నిలిచిన నేటి యుగపు ప్రాజ్ఞులకు.

వైరిమూకలకు బుద్ధిచెప్పు వీర శిఖామణులకు.
పౌరులెల్లరకు శ్రేయమందించు ప్రబోధకులకు.

సమ సమాజమును స్థాపించే చైతన్యవంతులకు.
మమతానురాగములు చూపు మర్యాదస్తులకు.

దేశ గౌరవాన్నిసతతము కాపాడే ధీమంతులకు.
మోసగాళ్ళను తరిమి కొట్టే ఘన సాహసికులకు.

భయమన్నదెఱుంగని భరతభూమి తనయులకు.
 న్యాయమును ధర్మమును నిలబెట్టు వైతాళికులకు.

ఓటేద్దాం రారండి!ఓ భాతీయులారా!కదలి రండి!
నేటి ప్రజాస్వామ్యన్ని బ్రతికించగా పరుగు పెట్టండి!

పాలితులము మనమే!నేడు మనమే ప్రభువులము!
కాలమునే త్రిప్పుదము!కలసి మెలసి పయనిద్దాము!//
************************


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics