STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

విజ్ఞాన తరంగాలు

విజ్ఞాన తరంగాలు

1 min
18

విజ్ఞాన తరంగము.
(వచన కవిత.)

అంతర్జాలమీ భువిపై నూతనంబౌ యద్భుతావిష్కరణము.
వింతగా జనుల కాధారమై విలసిల్లె నీ విజ్ఞానభాండాగారము.

పిన్నపెద్ద యను భేదభావము చూపదీ ప్రతిభా విన్యాసము.
వన్నె చిన్నెల ప్రపంచాని కధినాయకత్వమౌ మేధావిత్వము.

మనుజు లెల్లరు దీని మాయలోబడి పోవుచుండుట సత్యము.
ధన సంపాదన కిదే మార్గమని సంతసించుటే నిత్య కృత్యము.

జీవితంబున కతి ముఖ్యమౌ చేతనత్వము పెంపొందించును.
దైవికంబగు శక్తివోలె మనిషిలో ధైర్యమును పొలయించును.

మానవాళికి నేడు మనుగడను నిర్దేశించునీ వివేక ప్రకాశము.
ప్రాణములు నిల్పు చుండునీ విషయసేకరణ విశేషాభ్యాసము.

వసుధైక కుటుంబమునకాలంబనమీ దివ్యమౌ పరిశోధనము.
వసియించునిది నేడు ప్రతి గృహసీమలో భూరి భాగ్యప్రదము.

మంచి చెడుల మేళవింపుగా మహికి సామ్రాజ్ఞియై గెలుపొందెను.
ఎంచి చూడగ జనుల హృదయాలలో నిలచి ఎరుక కలిగించును.

నూతనంబగు ధిషణతో పయనించుచుండు సకల విద్యాసారము.
భాతితో ద్రిమ్మరుచు భవిష్యత్తును దిద్దుచుండు విజ్ఞాన తరంగము.//
**************************


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics