సాయి.. శ్రీనివాస భారతి
సాయి.. శ్రీనివాస భారతి


సాయిరాం,సాయిరాం, ఓం సాయిరాం
ఓం సాయి, శ్రీసాయి, జయసాయిరాం
హరివోమ్, హరివోమ్, శ్రీసాయిరాం
జయ జయ జయఓమ్..జయ సాయిరాం....పల్లవి
సాయిని మనసున ధ్యానించు
తనువుతో దానిని ముడిపెట్టు
నిరతం సాయీ పదధ్యానం
చేకూర్చునుగా సర్వసుఖం " సాయిరాం"
సాయీ అందరి బంధువయా
యోగ క్షేమం చూచునయా
అందరు సాయికి ఇష్టములే
భోధలుపాటించి బ్రతుకవలె. "సాయిరాం"
గణేశ, లక్మి,రామురహీం
అల్లా, క్రీస్తు..అన్నీతనే
ఆచారాలతో పనిలేదు
హృదయం సాయికి అందించు. "సాయిరాం"
ఎక్కడ ఉన్నా, ఏమైనా
హృదిలో సాయిని నిలిపుంచు
సర్వం తానై కాచునుగా
మదిలో భయము నీకెలా. "సాయిరాం"
పాపం పుణ్యం మది నెంచు
భూతదయనూ చూపించు
కర్మ ఫలితమూ మారునురా
దైవ ధ్యానం తోడుంటే. ..."సాయిరాం"
---------౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪౪-------------
(పల్లవి..సేకరించింది...చరణాలు స్వంతం)