ఒక తప్పు జరిగాక.....శ్రీనివాస
ఒక తప్పు జరిగాక.....శ్రీనివాస


ఒక
అమ్మ బాధ
ఏం తిన్నాడో ఎక్కడున్నాడో అని
ఒక
నాన్న బాధ
ఎటెళ్లిందో, ఏమైందో అని
ఒక
అన్న బాధ
నేనూ ఒకర్ని ఇలానే బాధ పెట్టానే
అది ఇలా మారేలా ఉందా
అయ్యో .. ఈ తప్పు జరగకూడదు
చెల్లెలి ఆవేదన
అక్క పొరపాటుకు
నా జీవితం ఎటు తిరుగుతోందోనని
తమ్ముడి వ్యధ
అన్నయ్య లాగే...నేను కూడానా
లేదా
అలాంటి పొరపాటు చెయ్యకూడదా
అంతర్మధనం.... అందరిలోనూ
ఒక తప్పు జరిగాక
కూలి కెళ్లందే పొట్టగడవని బ్రతుకులు
తల్లులవైతే
వలసపోయైనా.
పిల్లల్ని స్థితిమంతులు చేయాలని
ఆశలు తండ్రులవి
రెక్కలు ముక్కలైనా
ఫలితం దక్కని జీవితాలే ఎక్కువ
ఆప్యాయత.. అనుబంధాలు
మృగ్యమై పోయాయి బాధ్యతల్లో వారికి
ఆనందాల్లో వీరికి
చదువులు పెరిగితే
పేదరికం పోతే
సమస్య కొంతైనా తగ్గుతుందేమో
అంతవరకు
అందరూ
దీపం చుట్టూ శలభాలే....
-------౪౪౪౪౪౪౪౪౪౪---------