బెదిరింపు.....శ్రీనివాస భారతి
బెదిరింపు.....శ్రీనివాస భారతి


ఛార్జింగ్ చెయ్యకపోతే
చదవమంటే.....వండమంటే
తాగొద్దంటే... తిట్టావంటే
కొట్టా వంటే...ఇన్సుల్ట్ చేస్తే
ఉండమంటే...వెళ్లమంటే
పనిచెయ్యమంటే
లవ్ ఫెయిల్ ఐతే...
డబ్బు ఇవ్వక పోతే
గర్ల్ఫ్రెండ్ ఇంకోడితో..కన్పిస్తే
బహుమానాలు ఖరీదువి అడిగితే
బాగా చదివినోడితో పోలిస్తే
సెల్ ఫోన్ చూడొద్దంటే
స్కూల్ కు వెళ్లమంటే
పరీక్ష ఫెయిల్ ఐతే
చెడు స్నేహం మానమంటే
తినమంటే......వద్దంటే
కుటుంబ కలహాలు
కొంచెం అప్పు తీర్చక పోతే
మద్యం మత్తు దారుణాలు
చచ్చిపోయే ఆలోచనలు
అంటోంది ఇప్పటి తరం
ఉరి, ఫ్యాన్, రైలుపట్టాలు
పురుగు మందులు , ఫినాయిల్
ఏదో ఒకటి మార్గంగా ఎంచుకొంటూ
చావుకు కారణాలనేకం
చచ్చి ఏం సాధిస్తాం?
విలువల్లేవు... బాధ్యత రాదు
ప్రేమ లేదు..ఆప్యాయత తెలీదు
శృంగారం తప్ప ఇంకేం అక్కర్లేదు
ఆడా మగా పాడాలోచన్లు
పతనమైపోయే నైతిక విలువలు
ఏం చేసైనా పోషించు
ఎలాగైనా కాపాడు..నీ బాధ్యత
అవసరానికి మించి
అడ్డదారి సంపాదన కొందరు
అప్పులు చేసి ధారపోసింది కొందరు
తండ్రుల కష్టం కొడుకుల జల్సా
పెంపకం పట్టని తల్లితండ్రులు కొంత
సినిమాల్లో చూపించాలి మరి
కనీసం ప్రకటనలు గా నైనా..
సంపాదన ఆధారం, తెలివితక్కువ నిర్ణయం
వీధిన పడ్డ బ్రతుకులు..తెగిన గాలిపటాలు
మేల్కొకుంటే మాత్రం
పనికిరాని ఆలోచనల ప్రభావం..
కుటుంబాల్ని విచ్చిన్నం చేస్తోంది
మానవ మనుగడని ప్రశ్నిస్తూ...