దుప్పట్లో దూరాక......శ్రీనివాస
దుప్పట్లో దూరాక......శ్రీనివాస


కన్ను తెరిస్తే
ప్రేమ పురాణం
మూస్తే
ప్రేమ కవిత్వం
ఎక్కువ భాగం ఏదోలా
వాస్తవానికి ముసుగేసేలా
ఆశకు తోడు ఆశయమైతే
సహకరపు చేతులు కలుస్తాయ్
కొన్ని మెదడ్లు విరుస్తాయి
కొన్ని కలాలు మెరుస్తాయి
గొంగళి పురుగు పాపం చావు
బటర్ఫ్లయ్ ఎంతో హాయి
చావు పుట్టుకల దూరం కొంచెం
ఏదో ఒకలా బ్రతికేద్దామా
కూటికి గుడ్డకి వెదికే ప్రేమలు
కావా అవి ఆకర్షణలు
లోపలి దుస్తులు కొనలేం గానీ
ప్రేమని మాత్రం పంచేస్తుంటాం
తిట్టుకోకండి నన్ను మీరంతా
వాస్తవమెప్పుడు చేదే గనుక
దీపం చుట్టూ పురుగుల్లా
రెక్కలు రాలి కొట్టుకుపోదాం
పాఠశాలలో పుట్టే ప్రేమలు
పెంచుతున్నాయి సెల్ రాతలు
ఇంటర్నెట్ విపరీతార్ధం
వెదక్కముందే బూతు పురాణం
తల్లి తండ్రుల కూలి బ్రతుకులు
పిల్లలకవి స్వేచ్ఛ గాలులు
గర్ల్ ఫ్రెండ్ ఫాషన్ ఇప్పుడు
ఎలా ఒకలా పడేయక తప్పదు
ఎవరూ చెప్పని శృంగార పాఠం
ఒడిలో పడుకొని మనం నేర్పుదాం
నెలల నొప్పులకు మాత్రల మార్గం
ఆప్యాయతకు ఆఖరు స్వర్గం
కవితలు రాద్దాం కధలు చెప్పుదాం
సౌందర్య రాశివని బుట్టలో వేద్దాం
అవసరం తీరాక పక్కకు నెడదాం
ఎవరూ నేర్పని శృంగారశాస్త్రం
తయారుచేద్దాం కొత్తగా మనం
ఆప్యాయత అనుబంధాల కన్నా
సుఖం ఇచ్చే సంతోషం మిన్న
సమాజం చెడిపోతుంటే
విలువల కెక్కడ వెదుక్కుంటాం?
తిందామ్ తిరుగుతు పడుకుందాం
ఆస్తి పోతే ఎదురు తిరుగుదాం
మైకం కొంచెం దిగిపోగానే
చెరోదారి వెదుక్కుందాం
నీకో భర్త నాకో భార్య
వెదికితే మాత్రం దొరక్కపోరా
నీ నా పిల్లలు ఎందరైనా
అనాధాశ్రపు తరగని ఆస్తులు
వయసు వేడిలో రెచ్చిన కోర్కెలు
మనస్తత్వపు పతన విలువలు
కోపం, నేరం, పాపం ,శిక్షలు
నేర్పని చదువుల వెదుకులాటలు
ఇలాగే ముందుకు పోదాం
దుప్పటి కప్పుకు కలలు కందాం
-----------@@@@@@@@@@----------
(కొందరు అబ్బాయిల అమ్మాయిల ప్రవర్తన కలిగించిన బాధతో)