ఊపిరి....శ్రీనివాస భారతి
ఊపిరి....శ్రీనివాస భారతి


నన్ను దూరం పెట్టి
నువ్వేం పొందాలనుకున్నావో
నా కర్ధం కాలేదింక
కానీ నా తలపుల నిండా
నువ్వే ఉన్నావు మౌనరాగంలా
నీలో అణువణువు దాగున్న నన్ను
ఎలా గెంటేయగలవు?
నీ ఊపిరి నాదే
నా ఊహలు నీవే
నన్ను నన్నుగా చూడు
ప్రపంచం ఎంత అందమైందో తెలుస్తుంది
నా ఊపిరి ఉన్నంతవరకు
ధ్యానం నీ పైనే
మౌనంగా ప్రేమించడం నాక్కూడా తెలుసు
ఇష్టం ...
మరింత ఇష్టంగా మారేందుకు
నేనెంత ఆలోచించానో?
అక్షరాల్లో నిన్ను చూసి
ఎంత మురిసిపోయానో?
అల్లరి నీ జవాబులను
ఎంత ఆస్వాదించానో?
నిన్ను ఆటపట్టించి
నన్ను వెదుక్కున్నాను నీలో
నన్నొ జడపదార్ధంలా చూశావు
చలనం కల్గించావ్
మళ్ళీ గిరాటేసి
మరిచిపోదామనుకున్నావ్
నీలో ఉన్న నన్నెలా తీసేయగలవ్..
***************************
(వెన్నెల్లో ఆడపిల్లకు....ఎన్నో ఏళ్ల జ్ఞాపకంగా)