విద్యార్థి.....శ్రీనివాస భారతి
విద్యార్థి.....శ్రీనివాస భారతి
నేనో అధ్యాపకుడ్ని
నలుపనే అజ్ఞానపు పలకమీద
తెలుపనే జ్ఞానకాంతుల్ని వెదజల్లి
వాళ్ళ మెదడు పొరల్లో నేనో జ్ఞాపకం ఔతాను
మట్టి ముద్ద వంటి నన్ను
వర్ణమాలతో శ్రీకారం చుట్టి
సువర్ణ జీవితం అందించిన గురువులముందు
నేనెప్పుడూ లఘువునే
అనంత విజ్ఞాన సాగరాన్ని మధించే క్రియలో
నేను పొందిన అల్ప జ్ఞానాన్ని
పదిమందికి పంచిపెడుతూ
కొత్త ను ఆహ్వానించి, ఆస్వాదిస్తూ
నిరంతరం నేర్చుకొనే నిత్య విద్యార్థిని.
అంతం లేని జ్ఞానాన్ని
అనునిత్యం అన్వేషించే ఆశాజీవిని.