సెక్స్...
సెక్స్...
సెక్స్
మాటే మంత్రం
ఫ్రీ ఫోన్ లు వచ్చాక
నెలకు కొంచెం వేసి
నలుగురూ బూతులు చూసి
కుదిరితే అలాగే చేసి
మానవత్వాల్ని మంటగలిపేసి
బాధ్యతల్ని గాలికొదిలేసి
కొత్త ఆర్ధిక సంబంధాలు
మత్తు నేర్చిన బతుకులు
పెరిగిన సైన్స్
కడుపాకలి తీర్చడం మానేసి
కోర్కెల వెంట తిరుగుతొంది
మానవ సంబంధాలు
ఆడది కేంద్రం గా
కోర్కెల ఉపగ్రహం ఎక్కి
స్వైరవిహారం చేస్తున్నాయి...
వయసుతో నిమిత్తం లేదు
వరస కాకున్న ఫర్వాలేదు
గాలికి పెరిగిన శరీరం
శిక్షల భయం లేక
విచ్చలవిడి జీవితాలు
మానవుల్ని
మ్యూజియంలో
చూసుకొనేలా చేస్తాయి..మరి
జాగ్రత్త పడాలి మనమంతా