సాయితత్వం....శ్రీనివాస భారతి
సాయితత్వం....శ్రీనివాస భారతి
సాయి ప్రేమకు అంతేముంది
సాయి కరుణకి లోటేముంది
ఆర్తితో సాయిని పిలిచిచూడు
అడుగులు నీవైపు నమ్మి చూడు
. !! సాయి !!
ఆశలు కోర్కెలు వ్యామోహాలు
అంతులేని ఆవేదనలు
నేను నాదను మమకారంతో
చేస్తున్నామెన్నెన్నో తప్పులు
. .. !!సాయి!!
ఎవరు నీవు నేనెవరో చూడు
నీ నా మధ్యను గోడను కూల్చు
మాయ నాటకం మహిమను చూడు
స్వార్ధం వీడితె స్నేహ హస్తమే
. !!సాయి!!
నేను నువ్వూ ఒకటేనోయి
విరాగిగా బ్రతకగలిగితే
సిరిసంపదలు ఆలుసుతులు
వెంటరారు...పంచుకోరు
!! సా యి!!
ఎందుకు అహం ఏమిటి మోహం
ఏం సాధించావని గొప్పలుపోడం
మంచి చెడ్డా వెంటొస్తాయి
మానవత్వమే మిగిలుంటుంది
!!సాయి!!
నిన్ను నువ్వు సరిగా చూస్తే
జరిగినవన్ని గుర్తుకు వస్తే
నీలో నెత్తురు రక్తమాంసాలు
మానవ సేవకు పనికి వస్తే
!!సాయి!!
మనిషిగా మారు మంచిని కోరు
చావు పుట్టుకలు జయించలేరు
సర్వం చూసే సూర్య చంద్రులు
నీవిషయం..నా చెవినేయకపోరు
!!సాయి!!
*********%%%%%%%**********