సాయి చరితము-22
సాయి చరితము-22


సాయి చరితము-22
ప: షిరిడీలో వున్నావని
అందురు నిను సాయీ
నీవులేనిదెక్కడ
నీ తలపులన్ని ఇక్కడ
ఈగుండెలో భద్రమిక
చ: గురువేగా దైవమంటె
సద్గురువేగా మా సర్వమంటె
కాపాడే నీవుంటే
కలతలేమి లేవు ఇక
లేమి మమ్ము బాధించదిక
చ: సాయి నీ నామమే
కలిగించే హాయినిక
కలగదే హాని ఇక నిను
తలచు మనసుకు
ధన్యులము మేము ఓ
సాయిదేవా
చ: మౌనమే ధ్యానమని
మాకు నేర్పినావు
పరులకొరకు పాటుపడే
పాటనేర్పినావు
మాటతో మనసు గెలిచె
కిటుకు చూపినావు