Raja Sekhar CH V

Classics

4  

Raja Sekhar CH V

Classics

మన ఉత్సవం

మన ఉత్సవం

1 min
422



ఆంధ్రులకు ఉన్నాయి ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు,

ప్రతి ఏడాది ఆనందం అందించేను ఈ అరుదైన ఉత్సవాలు |౧|


మకర సంక్రాంతి తెచ్చెను ఆంధ్ర లోగిళ్ళలో పండుగ సందడి,

పసిడి పంటలు పొంగళ్లతో కృష్ణమ్మా గోదారమ్మ బిడ్డలు చేశేను హడావుడి |౨|


ఊరు ఊరునా జరిగెను ఆడంబర సంబరాలు,

పేట పేటకు కొత్తదనం నింపెను ఈ సంరంభాలు |త్రీ|


మార్గశిర మాసంలో జరిగెను ఉత్తరాంధ్రలో మహాలక్ష్మి పూజలు,

భక్తిశ్రద్ధలతో జరిగెను విశాఖ శ్రీ కనమహాలక్ష్మి దేవి కి పూజలు |౪|


విజయనగరంలో ప్రతిఏడాది జరిగెను పైడిమాంబ సిరిమానోత్సవం,

తిరుమలలో తిరుమలేశునికి జరుగుతూ వస్తోంది భవ్య బ్రహ్మోత్సవం |౫|


ఆంధ్రుల ఉత్సవాలు ఏంతో అపురూపం,

తరతరాలుగా సుందరంగా ఉండాలి వీటి స్వరూపం |౬|


Rate this content
Log in

Similar telugu poem from Classics