కుటిల బుద్ది
కుటిల బుద్ది


పద్యం:
మాట నేర్ప వచ్చు మకరాంక హయము కు
మాటలేల వచ్చు కంట కముకు
కుటిల బుధ్ధి చదువు కరటము వలె నుండు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! చిలుకకు మాటలు నేర్పవచ్చు కానీ కాకి కి ఎలా నేర్ప గలము? కుటిల బుద్ది గల ఆసక్తి లేని వారికి చదువు చెప్పుట కూడా కాకి కి మాటలు నేర్పించడం వంటిదే.