పరమశివా
పరమశివా

1 min

244
గౌరీ పతి గంగాధర గజచర్మాంబరధర
గణములనేలే తనయుని తండ్రి
గురువైనాడూ తనయుడె నీకూ
గమ్యం నీవే గమనం నీవైపే లోకాలకూ
జ్ఞానం పంచే వాణి ఒక సోదరి
సిరులను ఇచ్చే లక్ష్మిదీ అదే దారి
ఇరువురు స్త్రీలూ ఇరుగూ పొరుగవగా
పోరిక లేదని మరి పెండ్లి ఆడే సుకుమారీ
వాహనమేమో నందీ అట
ఇంధనమిక మెండేనంటా
ఉండేదేమో మంచుకొండంటా
మండుటెండైనా చల్లగా ఉండునట