Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalyani B S N K

Classics

4  

Kalyani B S N K

Classics

గురు వందనం

గురు వందనం

1 min
312


పొత్తిళ్ళలో ఉయ్యాలలూపుతూ ఉసురుని, ఊసునీ ,భాషనీ, భావాలని పరిచయం చేసిన అమ్మకి ముందుగా గురువందనం..🙏🏻


తన చిటికెన వేలు చివరన ఏం మాయ దాగుందో కానీ..పట్టుకున్న నా కళ్లముందు ప్రపంచమంతా సాక్షాత్కరింప చేసిన నాన్నకు గురువందనం..🙏🏻


తప్పటడగులు వేసే నాకు ఊతమిస్తూ..తమ అనుభవాల కథలకు నాతో *ఉ* కొట్టిస్తూ నాలో ఆసక్తిని, సృజనాత్మకతను తట్టిలేపిన నా తాతయ్యలు, నానమ్మ, బామ్మ, అత్తమ్మలు, పిన్నమ్మ లకు గురువందనం..🙏🏻


తోడబుట్టిన వారైనా అడుగడుగునా నాకు ప్రేరణ నిచ్చిన అన్నా చెల్లెళ్ల కు గురువందనం..🙏🏻


బుడి బుడి అడుగుల తొలి ప్రాయంలో బడిలోగిట నాతో పలక బలపం పట్టించిన నా తొలి గురువుల మొదలు నేటిదాకా నా లో జ్ఞాన దాహాన్ని తీర్చుతూ వచ్చిన గురువులు అందరికీ గురువందనం..🙏🏻


లోకానుభవాలను నాకు కలిగించి

ఎత్తు పల్లాలు తెలియ చేసి

పడిపోయాక తిరిగి లేవడం లో ఉన్న అద్వైతానుభూతి ను పరిచయం చేసిన బంధు మిత్రులందరికీ గురువందనం🙏🏻


జిజ్ఞాసను, ప్రేరణ ను, స్ఫూర్తి ని అహరహం నాలో రగిలింపచేసే ప్రకృతిలోని అణువణువుకూ గురువందనం..


నేటివరకూ ఎన్నో విలువైన పాఠాలను నేర్పిన నా జీవిత అనుభవాలకు, పరాజయ, అవమాన, క్లేశాలకు గురువందనం🙏🏻


చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడం నేర్పిన ప్రతీ సహృదయానికి గురువందనం🙏🏻


Rate this content
Log in

Similar telugu poem from Classics