STORYMIRROR

Kalyani B S N K

Abstract

4  

Kalyani B S N K

Abstract

జ్ఞాపకాల సిరి

జ్ఞాపకాల సిరి

1 min
413

లేత మామి ళ్లు

వేప పువ్వులు

కొత్త చివుళ్ళు

కుహూ కుహూ లు


చిక్కిన సెలయేళ్ళు..

పెళ్ళిళ్ళు, పెళ్ళివాళ్ళు..

కళ్ళాపి చల్లిన వాకిళ్ళు,

వాకిళ్ళు నిండిన సందల్లు

తాటాకు పందిళ్ళు

సిగ్గు ఎరుపుల చెక్కిళ్ళు


పచ్చ పచ్చని వరి మళ్ళు

ఉరుకులేసే పరవళ్ళు

దోసిల్ల నిండా ఈత పళ్ళు


ఒంటిపూట బళ్ళు

చెమట పట్టిన ఒళ్ళు

పరీక్షల హడావిడులు

సెలవులకు ఎదురుచూపులు


వేసవి తాపం తో

అనుభూతుల పరితాపం సంగమమే 

నా ఈ జ్ఞాపకాల సిరి

చిన్ననాటి అనుభవాల విరి.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract