పాలవెల్లి
పాలవెల్లి


ఒకరేమో తామరపువ్వు
ఒకరేమో మామిడి చివురు
ఒకరు దోర వెలగపండు
వేరొకరు బంతి పూచెండు
ఒకరు మొక్కజొన్న పొత్తు
మరొకరు ద్రాక్ష గుత్తు
మారేడూ, మాచుపత్రి,..
చెరకు ముక్కా, చేమంతి దండా..
సీతాఫలం, చెంగల్వపూలూ..
మొగలి రేకూ, తెల్లకలువ మొగ్గా..
బడిలో మేమంతా తలోరకం..
అందుకే చక్కగా పాలవెల్లిలో ఇమిడిపోతాం..
పూజించే మూర్తి ఏదైనా
మా అందరి సమాహారం
పీఠానికి నిండుదనం...
మా తుళ్ళింతల సహజత్వం
నవ వసంతానికి సంకేతం.