STORYMIRROR

Kalyani B S N K

Abstract Drama Classics

4  

Kalyani B S N K

Abstract Drama Classics

నా లోపల

నా లోపల

1 min
391

సుళ్లు తిరిగే వేదనలనీ..

పొంగి పొరలే ఆనందానుభూతి నీ..

పిడచ కట్టిన భయ భ్రాంతులు నీ..

ఆశ్చర్యాన్ని,

అనంత సంభ్రమం నీ,

జీవిత ప్రహేళికలనీ , 

దీనత నీ, దైన్యాన్ని,

నిర్నిద్రా నిర్లిప్తత లనూ,

నిర్భీతివిత్తుల మొలకలను,

మొహమాటాన్ని , మోహ దాహాదులను,

స్నేహా భిలాష నూ, సిగ్గు తెరలనూ,

విభిన్న తనూ , విశృంఖల తనూ,

తెగువను, తెంపరితనాన్ని ,

సత్యాన్వేషణ ఆసక్తిని, 

ఆలంబన అనురక్తి నీ, 

ఇంకా మిగిలిన ఇతర అనుభూతులను 

నా చిన్ని గుండె లోని క్రింది గదులలో సర్దేసి ..


పై గదుల నిండా

 కేవలం ..

భావి జీవిత ప్రక్రియలకు ఆహ్వాన సమ్రంభాలను నింపి, పెదవులపై ఒక చిరునవ్వు ను అతికించి నీ ఆటకై సిద్ధపడి ఒక పావులా నిలుచున్నాను ప్రభూ..

బహుశా ఇదే వానప్రస్థ జీవితానికి తొలి ఏర్పాటే మో..

నా లోపలి ఈ సర్దుబాటు నిన్ను చేరే తొలిమెట్టు ..

కదూ..



Rate this content
Log in

Similar telugu poem from Abstract