STORYMIRROR

Kalyani B S N K

Abstract

4  

Kalyani B S N K

Abstract

సహానుభూతి..

సహానుభూతి..

1 min
319

ఎవరి మనసునైనా చదివే శక్తి, ఆసక్తి

 నాకు లేవు కానీ 

నేనొక టి ఖచ్చితంగా చెప్పగలను

నేను కేవలం నాతో సంభాషించే

వ్యక్తుల ప్రతిబింబాన్ని.


బాధ, కోపం, ప్రేమ, ద్వేషం, అనురాగం...

అది ఏ భావన అయినా ఎదుటి ప్రాణి తో 

సహాను భూతి చెందడం నా బలహీనత..


గాలికి ఊగే పూల రెమ్మ ఆహ్లాదాన్ని

గాయపడిన ఉడుత కన్నీటి చుక్క నీ 

ఆత్మరక్షణ కై బుస కొట్టే మిన్నాగు ప్రకంపనలు నూ

ఉరిమే మేఘాన్ని, కురిసే వర్షపు చుక్కని..

ఇలా అన్నిటి నీ...

ఒకేలా...అదే తీరుగా

నాలోని అంతఃప్రపంచం అలా అలా అనుభూతి చెందుతుంది.


గత వసంతాల సంతోషాలు, 

అమితమైన ఆశ్చర్య అద్భుత భావనలుఅంతరంగ తరంగాలు గా ఎగసి పడుతు న్నప్పుడు 

వాటిని ఒడిసి పట్టుకోవడం నాకో సరదా..


ఇంతలో వచ్చి పడే ఆపదలో..

 అపరాధ భావన లో..

 నన్ను కొద్దిగా ఆందోళన పెట్టినా... 

అడుగు ముందుకు వేయడంలో ఉండే సాహసం

బహుశా నాలో తనంత తానే మొలకెత్తుతుంది

ఎటువంటి ప్రేరేపణలూ, ఉద్దీపనలు, స్ఫూర్తి మంత్రాలూ లేకుండానే..


నేను పీల్చే గాలిని పీల్చుకున్న మరో ప్రాణి తపన నూ, తాదాత్మ్యాన్ని సహానుభుతి చెందలేకపోతే ఇక నేనెందుకు...

నేను మనిషిని అనే భావన ఎందుకు..

కదా..



Rate this content
Log in

Similar telugu poem from Abstract