STORYMIRROR

Dinakar Reddy

Abstract Fantasy

4  

Dinakar Reddy

Abstract Fantasy

ఎక్కడోయీ ఋతుపవనమా..

ఎక్కడోయీ ఋతుపవనమా..

1 min
224

మండే నిప్పుల జ్వాలల సెగలు

వేసవి తాపపు కోరలు

గోడల వేడిని తోసుకు వచ్చే ఫ్యాను గాలులు

ఉక్కిరిబిక్కిరైన మనుషులు


మొలకల పున్నమి దాటింది

వేళకు కురిసే వర్షం కోసం

రైతుల ఆరాటం పెరిగింది

వార్తాపత్రికల్లో ట్యాగ్ లైన్ కోసం 

ముఖం చాటేయకు


ఓ ఋతుపవనమా

జాగు సేయక

ఖరీఫ్ పంట కోసం

వేసవి కడగండ్లు తీరడం కోసం

ఇలా రా


పయనమై ఎక్కడో

పరధ్యానంలో మరెక్కడో

అలా ఉండిపోయావా


కాస్త వేగం పెంచు

మా ఆశలపై నీళ్ళు చల్లకుండా

అమృత వర్షంలా

మాపైన కురిసి

మమ్ములను సేదదీర్చు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract