స్త్రీ శక్తి
స్త్రీ శక్తి


అమ్మాయి అనగానే జాగ్రత్తలు
అంతూ దరీ లేని బంధనాలు
జైలు వంటి ఇంట్లో బందీలు
కనిపించని బేడీలున్న ఖైదీలు
ఆడదానికి ఎన్నాళ్ళీ కట్టుబాట్లు
ఉద్యోగాలు చేస్తున్నా తప్పని ఇక్కట్లు
తోటి ఉద్యోగులతో పడరాని పాట్లు
ఎప్పటికీ తప్పేను ఈ అగచాట్లు
ఆడది తల్చుకుంటే ఏం చేయలేదు
తెగిస్తే ఏ బంధనం తనని ఆపలేదు
ఆదిశక్తిగా అందర్నీ మట్టుపెట్ట గలదు
అవకాశమిస్తే తానేమిటో నిరూపించ గలదు