భయం (prompt 4)
భయం (prompt 4)
1 min
22.4K
కరి మబ్బు నీడ పక్షి నీడను తరుముతుంది
పేదవారిని లేమి అనే భయం వెన్నాడుతుంది
అప్పులున్న వారికి వడ్డీ భారం భయపెడుతుంది
విద్యార్థులకు ఫలితాల రోజు దడ కలిగిస్తుంది
ఉన్నవారికి పరువు భయం పరుగు పెట్టిస్తుంది
వ్యాపారులకు కలిగే నష్టం నిద్రలేమిని కలిగిస్తుంది
ఆడపిల్లకు సమాజంలో రక్షణ కరువై బాధిస్తుంది
ప్రతి ఒక్కరికీ భయమనే రక్కసి కలవరపెడుతోంది.