*ఈనాటి కెరటం*
*ఈనాటి కెరటం*


కలం పడితే విప్పిన స్వరం,
ఆయన రాసిన పాటలు సముద్రపు భూగోళం,
ఆయన గొంతు ప్రకృతి వరప్రసాదం,
పాటలతో అలరించి,
ఎందరినో మెప్పించి,
పదాల మాధుర్యాన్ని గమనించి,
పాటలకు ప్రాణం పోసి,
పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు చేపట్టి,
పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికి తీసి,
40 ఏళ్ల సినీ ప్రస్థానం,
40 వేల పాటలు సినీరంగానికి అంకితం,
ప్రపంచంలో అరుదైన రికార్డును సాధించడం,
సినీ రంగానికి గొప్పతనం,
పద్మభూషణ్ అవార్డుతో చేసుకున్నాడు జన్మ ధన్యం,
బహుభాషా గాయకుడు,
సమరయోధుడు,
నిలువెత్తు రూపం,
ఈనాటి కెరటం,
ఆయనే మన బాలసుబ్రమణ్యం.