శుభాకాంక్షలు
శుభాకాంక్షలు
ఆడపిల్ల పుడుతుంది, పదహారు కళలతో
పండు వెన్నెల వంటి చల్లని వెలుగులతో
మహలక్ష్మి యని ఆదరిస్తారన్న ఆశతో
నట్టింట నడయాడును గలగల నవ్వుతో
ఆ వెలుగుల బొమ్మని, నవ్వుల నజరానాని
కళ్ళల్లో పెట్టుకొని, గుండెల్లో దాచుకోవాలని
మన ఇంటిని దోచుకుపోయే 'ఆడ'ది కాదని
'మన' ఇంటి పేర 'ఆ' ఇంట వెలుగు దీపమని
పుట్టింటికి, అత్తింటికి కనిపించని 'వారధి'గా
అత్తింట వంశాకురమునందించు దేవతగా
ఇంటికి ఇల్లాలు గా, ప్రేమకు ప్రతిరూపం గా
అందరూ అర్థం చేసుకోమని 'నా' మనవిగా
ఆడపిల్లల రోజు శుభాకాంక్షలతో