రంగు రంగుల ప్రపంచం!
రంగు రంగుల ప్రపంచం!


మన మధ్య కురిసే రంగుల జలపాతాల హోలీ,
పిల్లల నుంచి పెద్దల ఆడుకునే కేలి.
రంగు రంగుల మయం,
మన జీవితాల్లో నింపాలి ఆనందపు పరిమళం,
నేను చెప్పబోతున్నాను రంగుల స్వభావం.
నీలం రంగులో నిలిచి ఉండే ప్రేమ నమ్మకం,
ఎరుపు రంగులో ఎగసిపడే ఆకాంక్షల వెచ్చదనం,
ఆకుపచ్చ రంగులో వెల్లివిరిసే తాజాదనం,
గులాబీ రంగులో విచ్చుకునేే ఆనందపు చిలిపితనం,
పసుపు రంగులో దాచుకొనే శుభప్రదమైన సృజనం,
నారింజ రంగులో కలకాలం పక్కనుండే స్నేహం , ధైర్యం,
ఊదా రంగులో కలసిపోయే ఆధ్యాత్మిక సౌందర్యపు సాంప్రదాయం,
ఇక చూడబోతున్న మనం రంగు రంగుల ప్రపంచం,
నా కవిత చూసినవాళ్లు అందరికీ నా వందనం.