వలపు పుస్తకం
వలపు పుస్తకం
ప౹౹
చూసానులే తనివి తీరా ఆపాదమస్తకం
చదివానులే ఎదలోనీ ఆ వలపు పుస్తకం|2|
చ||
కళ్ళలోనే కదిలేనూ భావాలు ఓ వేయిగా
వాకిళ్ళు తెరిచి కోయిలే కూసెనే హాయిగా|2|
కొత్త గొంతుకలు కోరివచ్చి కలిసి పాడగా
మత్తిలె మది మొత్తం మరల కోరి వేడగా |ప|
చ||
పున్నమి వెన్నెల ఆ చల్లని వన్నెలే చల్లగా
సన్నగా మదిలో ఏదో కదలాడెలే మెల్లగా |2|
ఊహలే ఊపిరై ఊయలూగే తనువంతా
ఊసులే ఆ బాసలై చేరె తన అణువంతా |ప౹
చ||
తీయని వేడుకే చెలితోను కలసిన కూడికే
ప్రేమలో చెలితో చెట్టపట్టాలు ఒక వాడుకే |2|
ఎదలో కోరిక ఎలమితో పెంచెనే వలరాజు
జవరాలితో పంచుకొన మర్చిపోలేని రోజు౹ప౹