రంగుల మయం
రంగుల మయం
ఆకాశాన ఇంద్ర ధనుస్సున ఏడు రంగులు
ప్రకృతి కాంత పైట చెరగున ఎన్నో రంగులు
స్వామి పూజకు వచ్చే పూలు రంగు రంగులు
దేవుని సృష్టిలో కన్పట్టే చిత్రాతి చిత్రమైన రంగులు
చిన్న పిల్లలను ఆకర్షించే రంగు రంగుల బొమ్మలు
ఇంటి ముంగిట ఆడపిల్లలు వేసే రంగుల ముగ్గులు
ఆడవారిని ఆకర్షించే బంగారు, రంగు రాళ్ళ నగలు
ఎటు చూసినా ప్రపంచ మంతా వ్యాపించిన రంగులు