ఎక్కడున్నావ్ శివ ?
ఎక్కడున్నావ్ శివ ?
ఎక్కడున్నావ్ శివ ?
కటిక చీకటిని చీల్చుకుంటు
నాగ సర్పాల బాటలోన
ఎత్తు పల్లాలు లెక్కచేయక
అలుపన్న ధ్యాసేలేక
ఎంతదూరమీ ప్రయాణం.
ఎవరు లేరు నా తో
ఎవరూ రారు నా తో
ఒంటరి ప్రయాణం నీ కోసం
వేరే దారి లేదు శివ.
ఇంత నిశబ్ధ రాత్రి
ఎంత ప్రశాంత ప్రకృతి
సేదదీర్చే ఈ పిల్లగాలి
వెలుగు రేఖల జాడ అదిగో శివ.
అల్లంత దూరాన ఓ శిఖరాగ్రం
అది కోటి సూర్యుల వెలుగుల మయం
అది ధర్మానికి క్షేత్రం
శివ మనో కైలాసం
ప్రతీ జీవి అంతిమ లక్ష్యం..
అది నిశ్చల స్థితి
ఓ అద్భుత అనుభూతి
అదే శివ సన్నిధి.
కను రెప్పల చాటున దాగిన ప్రపంచం
అదొక మర్మ లోకం
కనులు తెరిస్తే చెదిరెను ధ్యానం
ఇంత ప్రయాణం నాలోనా శివ...
Aruna Prakash