కావ్య తెచ్చిన మార్పు
కావ్య తెచ్చిన మార్పు


పండరాపురం అనే గ్రామంలో కావ్య అనే అమ్మాయి ఉండేది. కావ్య కు మూగజీవులు , చెట్లన్నా చాలా ఇష్టం. ఒకరోజు కావ్య వాళ్ళింటికి ఆవు వచ్చి అంబా...అంబా... అంటూ అరుస్తుంది . కావ్య వచ్చి కొంచెం అన్నం, పలహారాలు తీసుకొచ్చి ఆవుకు పెట్టింది. ఆవు చాలా సంతోషపడి మళ్లీ అంబా.....అని గట్టిగా అరిచి వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఆవు తిన్నాక అంబా.... అని గట్టిగా అరుస్తుంది.
నాకేమైనా ఆవు చెప్పాలనుకుంటుందా! కావ్య కు అర్థం కాలేదు. ఒక రోజు ఆవు రాలేదు. కావ్య వెళ్ళి చూసేసరికి,ఆవు గర్భంతో వున్నది, అయినా సరే ఆవుతో రామయ్య పొలాన్ని దున్నిస్తున్నాడు, చాలా పనులు ఆవుతోనే చేయిస్తున్నాడు, ఇంకా గొడ్డున బాదుతున్నాడు. కావ్య కు కోపం వచ్చింది. నువ్వసలు మనిషివేనా, అసలు నీకు మానవత్వం అనేది ఉందా, మీ ఆవిడ ఇలా కడుపుతోనే ఉంటే నువ్వు ఈ పనులు చేయిస్తావా అని రామయ్య మీద కావ్య గట్టిగా అరిచింది. ఒక్కసారి ఆలోచించు నువ్వు లేచినప్పుడు నుంచి పడుకునే దాకా ఆవు నీకు ఎన్నో సేవలు చేస్తుంది. ఇంట్లో పిడకలు లేకపోతే ఆవుపేడ కావాలి, పాలు లేకపోతే ఆవుపాలే కావాలి ,ఆవు నీకు ఇన్ని సేవలు చేస్తున్నప్పుడు ఆవుకు నువ్వు ఇచ్చే ప్రేమ ఇదేనా. రామయ్యకు కావ్య అన్న మాటలకు కన్నీళ్ళు వచ్చాయి.నన్ను క్షమించు కావ్య నువ్వు
చిన్నదానీవైనా నాకు బుదొచ్చే విషయం చెప్పావు. రామయ్య అప్పటినుంచి ఆవుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆవు కావ్యకు అంబా.... అంటూ కృతజ్ఞతలు చెప్పింది.
మన అవసరాల కోసం మూగ ప్రాణాలను హింసించకండి, మనం కొట్టినా మన దగ్గరే పడుంటుంది, మనం అడగకుండానే ఎన్నో అవసరాలను తీరుస్తుంది.