STORYMIRROR

Kalyani B S N K

Inspirational

4  

Kalyani B S N K

Inspirational

శిల్పిగా నేను...

శిల్పిగా నేను...

1 min
311

ఇన్నేళ్ల నా ఈ బడి అనుభవం లో 

నన్ను నేనొక అసాధారణ శిల్పి గా మలచుకొన్నాను..

పిల్లల కలలను నా కళ్ళతో చూడడం అలవరచుకొన్నాను..


శిల్పం చెక్కే ప్రయత్నం లో

ఉలిదెబ్బలు నా చేతులను గాయపరచాయి

 కానీ ..

ఒక్క శిలనీ పగలనివ్వని నేర్పరినయ్యాను.

ఒక్కొక్క సారి ఈ నా ప్రయత్నం లో పాఠశాల ని పాటశాల గానూ మార్చాను..అవసరమైతే పాకశాల గానూ .. కొం డొ క చో ఉయ్యాల గానూ నన్ను నేను మార్చుకున్నాను..


అదేమి చిత్రమో..

ప్రతి శిలా నా ఉలి ముంగిట వెన్నపూసలా..

నా మెదడు పొరలలో నే లిఖించిన బొమ్మలే నా ఎదుట రూపు దిద్దుకున్న ప్రతిరూపాల్లా..


నాలుగు ముఖాలు నాకు లేవు గానీ

బడి ముంగిట ఈ సృష్టి కి నేనే కర్తనన్న అతిశయం నాలో...


ఈ ఊపిరి బొమ్మల ఉన్నత ఆశయాలకు, ఉత్తమ సంస్కారాలకు

నా మాట ఒక బీజమైతే నా నడత క్షేత్రమై వారి భవిత మొగ్గ తొడగాలి..

ఆ తొలకరి నా చేతుల మీదుగా 

ఆ చిట్టి మొలకలకు పచ్చిక పాన్పునివ్వాలి..

వెచ్చని ఊపిరవ్వాలి..


అందాకా ఏ గాయం నాలో శిల్పిని తిరొన్ముఖుని చేయదు..

ఏ శిలా శిల్పంగా మారక మరల్చబడదు..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational