నాన్న
నాన్న
1 min
175
నాన్న...
నా అన్న బంధం నీవై
నా ప్రతి అడుగులో తోడై నిలిచేవు
నీ జీవితానుభవాలను జోడించి
మా జీవన పాఠాలుగా బోధించేవు
కుటుంబాన్ని ఒక తాటిపై నిలిపి
అందరి బాగుకై నిరంతరం తపించేవు
చెదరని నిర్మలమైన నగుమోముతో
ఒడిదుడుకులను అధిగమించే ధైర్యం నింపేవు
సుగమమైన మా బాటను నిర్మించి
నీవు దాటిన ఎత్తుపల్లాలను మరుగున ఉంచేవు
తప్పులను కాయని నీ కాఠిన్యంతో
తప్పులెంచలేని మా మనుగడకి సోపానమయ్యేవు
నీవు నేర్పిన విలువలు
మేము చేరు తీరానికి దిశానిర్దేశాలు
నీ వ్యక్తిత్వ ధృడత్వం
తరతరాలకు పంచే వారసత్వం
నీ జీవన గమనం
మా నడవడికకు దిక్సూచిక.