ప్రశ్నలు
ప్రశ్నలు
ప్రశ్నలు
బాధ్యత అనే బరువు నీ భుజాన్ని దిగడం లేదా??
వ్యసనాలు తో స్నేహం వదులుకోలేవా??
నలిగిపోతూ నటిస్తున్నావా??
ఓడిపోతూ గెలిపిస్తున్నావా??
ప్రశ్నలు వేధిస్తున్నా జవాబు దొరకడం లేదా??
గమ్యం మర్చిపోయావా??
కంఫర్ట్ జోన్ లో బ్రతికేస్తున్నావా??
మౌనం తో పోరాడుతున్నావా??
ఓటమి తో గెలవలేకపోతున్నావా??
సాదించలేక సర్దుకుపోతున్నావా??
ఒంటరి గా ఏడుస్తున్నావా??
అద్దం నిన్ను చూసి నవ్వుతుందా??
గొంతు మూగబోయిందా??
ఎవరు సాయం చెయ్యట్లేదా??
ఎవరికి బాధని చెప్పుకోవాలో తెలియడం లేదా??
తోడు ఎవరు లేరా??
ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదా??
గతం నిన్ను బాధ పెడుతుందా??
భవిష్యత్తు నిన్ను భయపెడుతుందా??
<
/p>
ఇంకా ఎన్నో ప్రశ్నలు రోజూ నిన్ను బాధ పెడుతుంటే ఇంకా ఎవరికోసం నీ ఆలోచన.
అలసిపోయినా పర్లేదు పోరాడు.
ఓడిపోయినా పర్లేదు ప్రయత్నించు.
గాయపడినా బాధపడకు గమ్యం గురించి ఆలోచించు.
ఏం చేద్దాం అని మొదలుపెట్టావ్, ఎవరికోసమని ఆగిపోతున్నావ్, దేనికోసం నీ త్యాగం.
మనశ్శాంతి కన్నా గొప్పది కాదు నీ త్యాగం.
ఎక్కడ ఆపేసావో గుర్తు తెచ్చుకో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టు.
నీ జీవితం ఎవరికి బానిస కాదు.. జీవితం తో ఆడుకునే వాళ్ళని ఆదుకోవాలని ఆగిపోతున్నావ్.
అడుగడుగునా అడ్డంకులు, దాటుకుంటూ పోవాలే తప్ప ఆలోచిస్తూ కాలం వృధా చెయ్యకు.
నీకు నమ్మకం వుంటే ఎవరి సాయం నీకు అక్కర్లేదు. నీతో నీకే పోటి.
బాధని గెలిచి చూపించు, ఒంటరితనాన్ని ఓడించి మాట్లాడు. వెనక్కి తిరిగి ఆలోచించకు, ముందడుగు వేస్తూ శిఖరానికి గురిపెట్టు.
"లక్ష్యం కోసం త్యాగం చెయ్యి, లక్ష్యాన్ని త్యాగం చెయ్యకు".
- కిషోర్ శమళ్ల