అందం ఎదురైతే
అందం ఎదురైతే


ఎంత వెతికినా దొరకని అపురూప శిల్పం లా మెరుస్తూ..
కళ్ళ ముందే నడుస్తూ..
ఊహకే అందని అందం ఎదురవుతుంటే..
మాటలు తడబడి, మెదడే చెదిరి
కాలమే మరచి, పయణమే మార్చి
నీకోసం అంటూ వచ్చేస్తున్నా...
దూరం నన్ను ఆపలేదు...
ప్రాణం కోసం నా ప్రయాణం ఆగదు...
నీ రూపం నా కళ్లెదుటే నిలిచిపోయిందనుకుంటా....
నిదురలోకి జారుకున్నాను.. కలలో నిన్ను తలచుకున్నాను..
ఏమైందో ఏమో!! నా మనసిచ్చానే నీకె నేను..
నాలో నేను లేనే నా కనులే తెరచి నీ కలగన్నాను..
వామ్మో ఇది ప్రేమే నా మనసే నాకు చెప్పేస్తుంది..
అమ్మాయి అందమే ఓ ఐస్కాంతామై
నన్నట్టా లాగేస్తుందో
..
తనకందిన అందాన్నంత చుట్టేస్తుందో..
ఒక్కసారి నా ప్రాణం తనని కోరుకుంది.. కోరిక తీర్చమంది..
కమ్మనైన కలలా మిగిలిపోకే..
తరిగిపోయే ఊపిరల్లే కరిగిపోకే..
మారిపోయే కాలమల్లే మారిపోకే....
తీరిపోని బంధమల్లే నిలిచిపోవే.......
చూడలేనే నువ్వు లేని నన్ను...
ఊహించలేనే నాలో లేని నిన్ను...
౼ కిషోర్ శమళ్ల