కంఫర్ట్ జోన్
కంఫర్ట్ జోన్
కూర్చున్న చోటు నుంచి కదలనివ్వదు.
పడుకున్న పాన్పు మీద నుంచి లేవనివ్వదు.
కాలు కదపనివ్వదు.
వేలు ఎత్తనివ్వదు.
మాటలతో కాలక్షేపం చేయిస్తుంది.
రోజంతా ఏం చేయకుండా కాలం పరుగు తీస్తుంది.
కాలక్షేపం చేస్తుంటే కాలం మరచిపోయేలా చేస్తుంది.
సుఖానికి బానిసైన శరీరం కష్టమంటే కన్నెర్రజేస్తుంది.
ఖాళీగా ఉన్న పెద్ద బాధనిపించదు.
ఆలస్యంగా లేచినా అడిగే దిక్కు ఉండదు.
అంతెందుకు నిన్న అనుకున్న లక్ష్యం ఈరోజు గుర్తుండదు.
రేపటి గురించి దిగులుండదు.
బాధలు గుర్తుండవు, బాధ్యతలు గుర్తుకు రావు
ఏం సాధించాలి ఇంతకుమించి అన్న ఆలోచనలు
ఏం చేస్తే ఏం జరుగుతోందన్న భయం
వ్యాయామం తో ఏం పని, హాయిగా సోఫా లో నిదురించక!!
డబ్బుకేం కరువు. అబద్ధం ఆడితే కాసుల వర్షం కురిపించే కుటుంబం లేదా!!
స్పూర్తి దేనికి మనల్నే స్పూర్తి గా నలుగురికి పరిచయం చేయక!!
నలుగురితో ఏం పని, నాలుగ్గోడల మధ్య నలుగుతూ బ్రతకక!!
బ్రతకడానికి సరిపోయే మార్గం వెతికావు. ఏం చెప్పినా అర్ధం చేసుకోవు.
ఒక్కసారి నాలుగ్గోడల వదిలి నలుగురిలోకి రా. మరో ప్రపంచం ఎదురు చూస్తోంది, వెళ్లి పరిచయం చేసుకో.
నిదురపోయింది చాలు, లేచి కన్న కలల్ని నిజం చేసుకో.
కాలక్షేపం ఎందుకు, కాసేపు కాలం తో పరిగెత్తు.
ఆలస్యం ఎందుకు, అవకాశం అందుకో.
పోటీ పడు, రాజీ పడకు.
ఓడిపోతే ఊరుకోకు. ఓటమిని జయించే రోజు వరకు పోరాడుతూనే వుండు.
"కంఫర్ట్ జోన్ ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది. కానీ నిన్ను తన గుప్పిట్లో పెట్టుకుని బానిస చేస్తుంది. బానిసలా బ్రతకాలి అంటే ఆ గదిలో ఆనందంగా గడిపేయి, రాజు లా బ్రతకాలి అంటే గోడలు బద్దలకొట్టి బయటకి రా''
౼ కిషోర్ శమళ్ల